Sri Veerabrahmendra Swamy Vishwaroopam Picture Image
Download This Photo

కలిమాయనుండి రక్షింపబడుటకు ఈ ఫోటో మీ కిష్టమైన సైజులో ప్రింటు చేయించుకొని మీ ఇంటియందు పెట్టుకొనండి. మీకిష్టమైన బందుమిత్రులకు ప్రింటు చేయించి బహుకరించండి లేదా ఈ విషయము తెలియజేయండి. 2017 సం.లో ప్రతీ ఇంట ఈ ఫోటో ఉండాలి. అందరమూ ఈ కలియుగములో శ్రీ స్వామివారి రక్షణ పొందాలి.


"ఓం శ్రీ విరాట్ విశ్వబ్రహ్మణే నమః"

MMBM

MMBM
Kaliyuga Rakshana Kavacham
2017 Palmplet

"శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆదేశానుసారము విశ్వశాంతికై, ప్రపంచమతాల సమైఖ్యతకై, యునైటెడ్ విశ్వగాయత్రీ యునివర్సల్ ఆర్గనైజేషన్ 1989వ సం. లో స్థాపించబడినది."


శ్రీ స్వామి వారు రాసిన కాలజ్ఞానము – ఆత్మజ్ఞానము ను ప్రపంచవ్యాప్తముగా ప్రచారము చేయడము ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశము. బ్రహ్మశ్రీ మడుపు సత్యనారాయణ విశ్వబ్రహ్మ గారు ఈ ఆర్గనైజేషన్ ను 1989వ సం. లో స్థాపించి, ఇప్పడికీ కాలజ్ఞాన – ఆత్మజ్ఞాన ప్రచార యజ్ఞం కొనసాగిస్తూనే వున్నారు. అన్నిటికన్నా మనిషి అభ్యున్నతికి జ్ఞాన దానము ముఖ్యమని తలచిన వీరు, ముక్తిమార్గము – భక్తిమార్గము అను పుస్తకము రూపొందించినారు. ఈ పుస్తకములో కాలజ్ఞాన – ఆత్మజ్ఞాన వాక్యాలు పధ్యరూపములో అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఏర్పరచినారు మరియు అనేకమైన మంత్రములను, జ్ఞానసూక్తులను వుంచినారు. ఈ పుస్తకమును గడచిన 24 సం.లో దాదాపు 2 లక్షల కాపీలకు పైగా ప్రింటు చేయించి ఉచితంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధివ్య ప్రసాదముగా అందించడము జరుగుతుంది. ఈ ముక్తిమార్గము – భక్తిమార్గము పుస్తకము చాలా శక్తివంతమైనది, ఈ పుస్తకమును 40 రోజులలో 9 మార్లు చదివిన వారికి నవగ్రహ దోషాలు తొలగి, కోరికలు వేరుతవి. ఇప్పడివరకు కొన్ని వేల మంది ఈ పుస్తకము చదివి సత్ఫలితాలను పొందియున్నారు. మీకు ఈ పుస్తకము కావాలనుకున్నచో, మీరు ఈ వెబ్ సైట్ లోనే క్రింద వున్న డౌన్ లోడ్ బటన్ ద్వారా సాఫ్ట్ కాపీని పొంద వచ్చును లేదా మమ్ములను సంప్రదించినచో ఒక పుస్తకమును పోస్ట్ ద్వారా ఉచితంగా పొందవచ్చును (ఈ సౌకర్యము భారత దేశంలో మాత్రమే).

ఒక చెడు మనిషిని పది మంది మంచి వాడు అంటే మంచి వాడుగా మారగలడు. మంచివాన్ని పది మంది చెడువాడు అంటే చెడ్డ వాడిగా మారే అవకాశము ఉన్నది. ప్రస్తుతము ప్రపంచములోని మానవులంతా చెడునే ఉచ్ఛరించుచున్నారు. అదే జరుగుచున్నది. మంచి, చెడు భావించడం, ఊహించడము, ఉచ్ఛరించడము ప్రతీ మనిషిలో జరుగుచున్నది. అదే తదాస్తు అన్నట్లు జరుగుచున్నది. కాబట్టి ఒక వైపు మనం కష్టాలు అనుభవిస్తున్నా అవి తప్పవు కాబట్టి చెడును ఊహించకుండా, ఉచ్ఛరించకుండా ఉందాము. ఆ భావముతోనే యునైటెడ్ విశ్వగాయత్రీ యునివర్సల్ ఆర్గనైజేషన్ స్థాపించబడి ఉద్దేశాలను ఆశయాలను ప్రచారము చేస్తున్నది. ప్రతీ మనిషి తనవంతు బాధ్యతగా ప్రచారము చేయగలరని ఆశించుచున్నాము.